Akhanda 2 tickets : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం అఖండ-2. ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మువీకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 4న రాత్రి 8గంటల నుంచి 10గంటల మధ్యలో ప్రీమియర్‌కు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ టికెట్ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. రోజుకు ఐదు షోలతో పాటు, పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి.