Akhanda Trailer
Akhanda: బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ మేనియా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో రాబోయే భారీ సినిమాలకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చిన బాలయ్య ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా వందకోట్ల క్లబ్ లో చేరారు. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా హ్యట్రిక్ కొట్టడమే కాదు కరోనా తరువాత థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టగలరన్న నమ్మకాన్ని ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసిందని తెలిసింది. అలాగే రూ.61.5కోట్ల షేర్‌ను దాటిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
RRR: ట్రైలర్ చూశాక తారక్-చెర్రీ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్!
దీని కన్నా ముందు బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి బాక్సాఫీసు వద్ద రూ.75 కోట్లను వసూలు చేయగా.. అఖండ ఆ సినిమా రికార్డులను తిరగరాస్తూ వందకోట్లను కలెక్ట్ చేసింది. నిజానికి నైజాంలో బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా ఉండవు.. అలాంటిది ఆ ఏరియాలో ఈ సినిమా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.50 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోండగా.. ఇండియాలో మిగిలిన ప్రాంతాలు, ఓవర్సీస్ కలిపి ఈ సినిమా మొత్తంగా పాతిక కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
Samantha: కడపలో సామ్.. భారీగా ట్రాఫిక్ జామ్!
ఈ సినిమాకు రూ.53 కోట్ల దాకా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకోగా.. విడుదలైన 8 రోజులకే అఖండ సినిమా వసూళ్లలో బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. ఏపీలో బెనిఫిట్ షోలపై బ్యాన్, టికెట్ ధరలపై నియంత్రణ లేకుంటే కలెక్షన్లు మరో రేంజ్ లో ఉండేవని అభిమానులు అభిప్రాయపడుతుండగా.. ఏదైతేనేం కరోనా లాక్ డౌన్ల తర్వాత థియేటర్లలో విడుదలై.. సినిమా ఇండస్ట్రీకి అఖండ ఊపిరి పోసిందని అంటున్నారు ప్రముఖులు. మొత్తంగా కెరీర్ లో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరిన బాలయ్య అఖండతో తన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పేశారు.