Akhil Akkineni: ఏజెంట్ లోడింగ్.. మైండ్ బ్లాంక్ చేసే పోస్టర్!
అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తుండగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అదలా ఉండగానే అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.
- Naresh Mannam
- Published On : July 11, 2021 / 12:37 PM IST
akhil-akkineni-agent-loading-mind-blank-poster-released
Akhil Akkineni: అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తుండగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అదలా ఉండగానే అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనపడబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోస మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు.
గతంలో కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. తిరిగి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ మొదలు సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ వరకు అందరూ తమ తమ సినిమాల పోస్టర్లు, టీజర్లు, పాటల ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులకు చేరవేశారు. ఈ క్రమంలోనే అఖిల్ ఏజెంట్ కూడా ఓ పోస్టర్ వదిలారు.
దర్శకుడు సురేందర్ సోషల్ మీడియా వేదిక విడుదల చేసిన ఈ పోస్టరుకు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.. ముందుముందు మీకు పండగే అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక పోస్టర్ మీద ARE YOU READY FOR A WILD RIDE అంటూ మరో క్యాప్షన్ ఇచ్చారు. అయితే.. అసలు ఈ పోస్టర్ లో అఖిల్ బాడీ మీదనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో అఖిల్ మేకోవర్ ఆ ఫిల్మ్ మేకర్స్ కు సైతం మెంటలెక్కిస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
This is just the beginning…Meeku mundu mundu undi pandaga!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/trOj5shejN
— SurenderReddy (@DirSurender) July 11, 2021
