Akhil Akkineni : శోభితతో నాగచైతన్య రిలేషన్.. మీడియా ముందు అఖిల్ ఏమి మాట్లాడాడో తెలుసా?
అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితతో రిలేషన్ లో ఉన్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని గురించి అఖిల్ ని ప్రశ్నించగా..
- gum 95921
- Published On : April 16, 2023 / 07:08 AM IST
Akhil Akkineni reaction on Naga Chaitanya Sobhita Dhulipala relation
Akhil Akkineni : అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోయిన్ శోభితతో (Sobhita Dhulipala) సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ గత కొంత వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు పై మొన్నటి వరకు ఎటువంటి ఆధారం లేదు. కానీ ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ బయటకివచ్చి సంచలనం సృష్టించింది. అయితే దీని పై ఇప్పటి వరకు చైతన్య, శోభిత ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరి గురించి అఖిల్ ని మీడియా ముందు ప్రశ్నించారు. అఖిల్ నటిస్తున్న తాజాగా చిత్రం ఏజెంట్ (Agent). ఈ మూవీ ప్రెస్ మీట్ నిన్న (ఏప్రిల్ 15) రాత్రి హైదరాబాద్ లో జరిగింది.
Agent : అఖిల్ ఫ్యాన్స్‌తో ఏజెంట్ నిర్మాత చిట్ చాట్.. కావాలనే అఖిల్‌ని టార్గెట్ చేస్తున్నారు!
ఈ కార్యక్రమంలో ఒక విలేకరి అఖిల్‌ని.. ”మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి. మీ పరిస్థితి ఏంటి” అని ప్రశ్నించారు. అఖిల్ బదులిస్తూ.. “నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లగా పిలక, బాడీ మెయిన్‌టైన్ చేయడమే సరిపోయింది” అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నిన్న రాత్రి ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18న ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకం పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.
