ఐ యామ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటున్న అఖిల్

  • Publish Date - February 4, 2020 / 12:02 PM IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న మూవీ టైటిల్ మంగళవారం సాయంత్రం అనౌన్స్ చేశారు.

అఖిల్ హీరోగా నటిస్తున్న నాలుగవ సినిమాకు ముందునుండి ప్రచారంలో ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిలే ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు అఖిల్ వాక్ చేస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 8వ తేది సాయంత్రం 6:18 నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో హీరోగా అఖిల్, దర్శకుడిగా భాస్కర్ హిట్ కొడతారని చిత్రబృందం  ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరపుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంగీతం : గోపి సుందర్, కెమెరా : ప్రదీష్ వర్మ, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ : అవినాష్ కొల్లా.