×
Ad

Akira Nandan: హైకోర్టును ఆశ్రయించిన పవన్‌ కొడుకు అకీరా.. కారణం ఏంటంటే?

తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(Akira Nandan).

Akira Nandan filed petition in High Court to protect his personality rights.

  • హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్
  • తన అనుమతి లేకుండా వీడియోలు వాడటంపై అభ్యంతరం
  • క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూచన

Akira Nandan: సోషల్ మీడియా, AI అందుబాటులోకి వచ్చాక మార్పింగ్ వీడియోలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్దం అనేది కూడా తెలుసుకోనంతగా వాటిని క్రియేట్ చేస్తున్నారు కొంతంది ఆకతాయిలు. దాంతో, చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే, ఈ మధ్య కాలంలో తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను వాడే అవకాశం లేకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు.

Hum Mein Shahenshah Kaun: 37 ఏళ్లుగా వాయిదా.. త్వరలో విడుదల.. కొంతమంది ప్రాణాలతో లేరు.. ఈ సినిమా గురించి మీకు తెలుసా?

టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది స్టార్స్, ప్రముఖులు ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(Akira Nandan) కూడా చేరాడు. పవన్ కళ్యాణ్ కొడుకుగా అకీరా నందన్ కి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగింది. దీంతో, అతని ఫోటోలను, వీడియోలను మార్పింగ్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈమధ్య ఏకంగా ఆయన హీరోగా AIతో సినిమా కూడా తీశేశారు.

దీంతో, అకీరా నందన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఏఐ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో కూడా క్రియేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. అలాగే అలాంటి కంటెంట్ క్రియేటర్లపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.