Akira Nandan Special Gift to Renu Desai on her Birthday Video Goes viral
Renu Desai : హీరోయిన్ గా, పవన్ మాజీ భార్యగా రేణుదేశాయ్ అందరికి పరిచయమే. ఇప్పటికి కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ పాత్ర పోషించి దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ ఉంటుంది రేణు దేశాయ్.
పవన్ – రేణు దేశాయ్ పిల్లలు అకిరా నందన్, ఆద్యలు రేణు దేశాయ్ దగ్గరే ఉంటారని తెలిసిందే. ప్రస్తుతం అకిరా(Akira Nandan) అమెరికాలో ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో మ్యూజిక్ కి సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నాడు. భవిష్యత్తులో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని సమాచారం. ఇటీవల డిసెంబర్ 4న రేణు దేశాయ్ పుటిన రోజు కావడంతో పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనయుడు అకిరా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.
Also Read : DJ Tillu : డీజే టిల్లు సీక్వెల్‌తో ఆగదు.. వరుసగా మూడేళ్ళకొక సీక్వెల్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన సిద్ధూ..
జానీ సినిమాలో రేణు దేశాయ్ షాట్స్ కొన్ని కట్ చేసి సప్త సాగరాలు దాటి సినిమాలోని సాంగ్ తో ఎడిట్ చేసి ఓ వీడియోని రూపొందించాడు అకిరా. ఇందులో పవన్ కళ్యాణ్ షాట్స్ కూడా ఉండటం విశేషం. ఈ వీడియోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. నా కొడుకు నా బర్త్ డేకి ఈ గిఫ్ట్ ఇచ్చాడు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అకిరా బాగా ఎడిట్ చేశాడని, వీడియో బాగుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.