DJ Tillu : డీజే టిల్లు సీక్వెల్‌తో ఆగదు.. వరుసగా మూడేళ్ళకొక సీక్వెల్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన సిద్ధూ..

తాజాగా సిద్ధు డీజే టిల్లు సీక్వెల్ పై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

DJ Tillu : డీజే టిల్లు సీక్వెల్‌తో ఆగదు.. వరుసగా మూడేళ్ళకొక సీక్వెల్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన సిద్ధూ..

Siddhu Jonnalagadda Interesting Comments on DJ Tillu Sequels

Updated On : December 10, 2023 / 8:12 AM IST

DJ Tillu Sequels : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda).. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అంతకుముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు చిన్న సినిమాల్లో హీరోగా చేసినా రాణి గుర్తింపు డీజే టిల్లుతో వచ్చింది. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సిద్ధూ, నేహా శెట్టి(Neha Shetty) ఇద్దరూ స్టార్స్ అయ్యారు.

డీజే టిల్లు భారీ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. సిద్ధు, అనుపమ(Anupama Parameswaran) జంటగా డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా సిద్ధు డీజే టిల్లు సీక్వెల్ పై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Also Read : Samantha : సమంత లేటెస్ట్ ఫోటోలు చూశారా? బాలీవుడ్ షోలో సందడి చేస్తూ..

ఇటీవల నితిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ నితిన్ తో ఓ ఒంటర్వ్యూ చేయగా అందులో సిద్ధు మాట్లాడుతూ.. డీజే టిల్లు ఇప్పుడు ఒక్క సీక్వెల్ తో అయిపోదు. ఒక సిరీస్ లాగా ఆ తర్వాత రెండు మూడేళ్లకు ఒకసారి ఒక సీక్వెల్ ఉంటుంది. డీజే టిల్లు సీక్వెల్స్ చేస్తూనే వేరే సినిమాలు చేస్తాను. మధ్యలో ఆ సినిమా స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తాను అని తెలిపాడు. దీంతో సిద్ధు అభిమానులు, డీజే టిల్లు సినిమా అభిమానులు డీజే టిల్లు సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫిబ్రవరిలో రాబోతున్న టిల్లు స్క్వేర్ ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.