×
Ad

Akkineni Brothers: రామ్ రిజెక్ట్ చేశాడట.. మరి అక్కినేని బ్రదర్స్ కి హిట్స్ వస్తాయా?

హీరో రామ్ పోతినేని వద్దనుకున్న రెండు కథలతో సినిమాలు చేస్తున్న అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్(Akkineni Brothers).

Akkineni Brothers are making films with scripts that hero Ram had rejected.

  • హీరో రామ్ రిజెక్ట్ చేసిన రెండు కథలు
  • ఒకటి అఖిల్ కి, ఒకటి నాగ చైతన్యకి
  • అన్నదమ్ములు హిట్ కొడతారా?

Akkineni Brothers: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథను మరో హీరో చేయడం అనేది మాములుగా జరుగుతూనే ఉంటుంది. తీరా హిట్ అయ్యాక అబ్బా అనవసరంగా వదులుకున్నానే అని కూడా అనుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఈ విషయాన్నీ చాలా మంది హీరోలు ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే, అక్కినేని హీరోలకు(Akkineni Brothers) కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యిందట.

కానీ, ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక హీరో వద్దకు వెళ్లిన రెండు కథలతో ఇపుడు అక్కినేని హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఆ కథలను వద్దనుకున్న ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. ఈ హీరో వద్దనుకున్న మొదటి సినిమా కార్తీక్ వర్మ చేస్తున్న వృషకర్మ మూవీ. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. పీరియాడికల్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట.

Varshini Sounderajan: అందాల వర్షంలో తడిపేస్తున్న యాంకర్ వర్షిణి.. ఫోటోలు

అయితే, ఈ కథను ముందుగా రామ్ పోతినేనికి చెప్పాడట దర్శకుడు కార్తీక్ వర్మ. కానీ, అప్పటికే ఒప్పుకున్న సినిమాల కారణంగా వృషకర్మ సినిమాను వద్దు అనుకున్నాడట రామ్ పోతినేని. ఇపుడు ఈ సినిమా విధులకు సిద్ధంగా ఉన్నది. ఇక రామ్ క్యాన్సిల్ చేస్తున్న మరో సినిమా లెనిన్. అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర తెరకెక్కిస్తున్నాడు.

విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా రాబోతుంది. చాలా కాలంగా హిట్స్ లేక బాధపడుతున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అయితే, ఈ కథను కూడా దర్శకుడు ముందుగా రామ్ పోతినేనికి వినిపించాడట. కానీ, ఎందుకో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట రామ్. మరి అలా రామ్ రిజెక్ట్ చేసిన రెండు కథలతో అక్కినేని అన్నదమ్ములు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమాలు వాళ్లకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయి అనేది చూడాలి.