Akkineni Nageswara Rao : ఏఎన్నార్ 100వ పుట్టినరోజు.. అక్కినేని విగ్రహావిష్కరణ చేస్తున్న ఫ్యామిలీ..

ఈ ఏడాది ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం ఆ వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

Akkineni Nageswara Rao statue launch at Annapurna Studios due to 100 birth anniversary

Akkineni Nageswara Rao : తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్ గా ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలతో, ఆయన వారసులతో, అభిమానుల ఆలోచనలతో ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన చనిపోయి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ ఏదో విషయంలో ఆయనను అభిమానులు తలుచుకుంటూనే వస్తున్నారు. తాజాగా ఆయన శతజయంతి వేడుక జరగబోతుంది. 1923 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఏడాదితో శతజయంతి వేడుకను జరుపుకోబోతున్నారు.

Unstoppable 3 : అన్‌స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్.. డేట్స్ కోసం చూస్తున్న..

ఇక ఈ వేడుకను అక్కినేని కుటుంబం గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. రేపు సెప్టెంబర్ 20 ఉదయం ఈ ఆవిష్కరణ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారని సమాచారం. అక్కినేని అభిమానులు కూడా ఈ శతజయంతి వేడుకను స్పెషల్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’గా..

కాగా అక్కినేని నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా రామాపురంలో జన్మించారు. గుడివాడ రైల్వే స్టేషన్ లో మొదలైన ఏఎన్నార్ సినీ ప్రయాణం.. తెలుగు తెరపైనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నిలిచేలా సాగింది. నటుడిగా ఎన్నో మరుపురాని పాత్రలు చేసిన అక్కినేని నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. అలాగే నిర్మాత కూడా సేవలు అందించారు. ఏఎన్నార్ చివరిగా అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం ‘మనం’లో నటించారు. ఆ మూవీ ప్రొడక్షన్ లో ఉండగానే ఆయన మరణించారు. జనవరి 22, 2014 లో ఏఎన్నార్ 90 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు