అక్కినేని సమంత.. మనసు ఆకాశమంత: బ్యూటీ విత్ హార్ట్.. వారి కోసమే

  • Publish Date - December 25, 2019 / 06:40 AM IST

అక్కినేని సమంత.. టాలీవుడ్‌లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్. ‘ఏమాయ చేశావే’ సినిమాతో కుర్రకారుని మాయ చేసి అదే సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి తెలుగింటి కోడలు అయిన ఈ అమ్మడు.. సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన పాత్రను నిర్వహిస్తుంది. లేటెస్ట్‌గా ఆంధ్రా ఆసుపత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌ను సందర్శించారు సమంత. అక్కడ తన స్వచ్ఛంద సేవా సంస్థ ‘ప్రత్యూష సపోర్ట్‌’, ఆంధ్రా ఆసుపత్రితో కలిసి గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఈ ప్రత్యూష సపోర్టు ద్వారా చికిత్స అందిస్తారు. అంతేకాదు వీటితో పాటు ప్రాణాపాయ వ్యాధులకు కూడా ప్రత్యూష సపోర్టు ద్వారా వైద్యం అందిస్తుంది సమంత. ఈ క్రమంలోనే క్రిస్మస్ సంధర్భంగా ఆంధ్రా ఆసుపత్రిని విజిట్ చేసింది సమంత. తాను నిర్వహిస్తున్న ప్రత్యూష సపోర్ట్ సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో కాసేపు గడిపి వారిలో కొత్త ఉత్సాహం నింపింది.

అదేవిధంగా అక్కడి డాక్టర్లతో మాట్లాడి, పిల్లల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ మేరకు తాను ఆంధ్రా ఆసుపత్రిని విజిట్ చేసి పిల్లలతో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ అమ్మడు. ఇంత మంది పిల్లలను ఒకేసారి కలవటం, అందరూ ఆరోగ్యంగా ఉండటం చూసి ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. సమంత చేసిన పనిపై నెటిజన్స్ స్పందిస్తూ.. సమంత నువ్వు సూపర్.. నీ హృదయం చాలా గొప్పది.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు