అక్ష‌య్, రోహిత్ ఫైటింగ్ వీడియో.. వైర‌ల్

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 03:52 AM IST
అక్ష‌య్, రోహిత్ ఫైటింగ్ వీడియో.. వైర‌ల్

Updated On : November 13, 2019 / 3:52 AM IST

అక్ష‌య్ కుమార్ ఏం చేసిన సూపర్ గానే ఉంటుంది. తాజాగా త‌న పై క‌ల్పిత వార్త రాసిన వెబ్‌ సైట్‌ కి ఓ వీడియోతో భలే పంచ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే… అక్ష‌య్ ప్రస్తుతం రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌వంశీ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఓ వెబ్ సైట్ రోహిత్‌, అక్ష‌య్‌కి సంబంధించి త‌ప్పుడు వార్తలు రాసింది. వారిద్ద‌రు గొడ‌వ‌ప‌డ్డార‌ని, వీరిని క‌లిపేందుకు క‌ర‌ణ్ జోహార్ మీడియేటింగ్ చేస్తున్నాడని రాశారు.

దీంతో త‌ప్పుడు వార్త రాసిన వెబ్‌ సైట్‌ కి అక్షయ్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. అక్ష‌య్, రోహిత్‌ నిజంగానే ఒక‌రినొక‌రు కొట్టుకున్న‌ట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో స్టార్టింగ్‌ లో కత్రినా ఫోన్‌ లో ఆ తప్పుడు వార్తను చూపిస్తూ.. వార్త చూశారు కదా, చూడండి నిజంగానే ఇప్పుడు అక్షయ్, రోహిత్ కొట్టుకుంటున్నారు అంటూ వెనక్కి వెళ్తుంది. వెంటనే అక్ష‌య్, రోహిత్‌ వచ్చి కొట్టుకుంటుంటే అందరూ వచ్చి వారిని ఆపుతారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సూర్యవంశీ సినిమాలో క‌త్రినా కైఫ్ హీరోయిన్‌.  షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.