Ala Vaikuntapuramlo : షెహజాదాకి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో.. వాళ్ళ సినిమాతో వాళ్ళకే ఎఫెక్ట్..

అలవైకుంఠపురం సినిమా హిందీ వర్షన్ ని తమ ఛానల్ లో ఫిబ్రవరి 2 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో షెహజాదా సినిమాకి గట్టి షాక్ తగిలింది. అలవైకుంఠపురంలో సినిమా హిందీ వర్షన్.............

Ala Vaikuntapuramlo :  కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా రోహిత్ ధావన్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా షెహజాదా. ఇది మన తెలుగు అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగమయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడి ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు పఠాన్ వల్ల మళ్ళీ వాయిదా పడి ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తామని కొత్త డేట్ ని ప్రకటించారు.

అయితే ఈ సినిమాకి ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమాతో సమస్య వచ్చింది. గతంలో అల్లుఅర్జున్ పుష్ప రిలీజయి బాలీవుడ్ లో హిట్ అయినప్పుడు అలవైకుంఠపురంలో సినిమాని కూడా హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. కానీ అప్పటికే ఈ సినిమా రీమేక్ షూట్ మొదలుపెట్టడంతో హీరో కార్తీక్ ఆర్యన్ ఆ సినిమా రిలీజ్ చేస్తే నేను షెహజాదా సినిమా నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఆగిపోయారు. అలవైకుంఠపురంలో సినిమా హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేస్తే షెహజాదా సినిమాని ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో అల్లు అరవింద్ ఆ ఆలోచనని విరమించుకున్నారు.

మన టాలీవుడ్ సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ చేసి గోల్డ్ మైన్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కి అమ్ముతారు. మన సినిమాలకి అక్కడ మంచి డిమాండ్ ఉండటంతో ఆ ఛానల్ కూడా ఎక్కువ రేట్లు పెట్టి మన సినిమాలని కొనుక్కుంటుంది. అయితే గతంలోనే అలవైకుంఠపురంలో సినిమాని గోల్డ్ మైన్స్ ఛానల్ కి అమ్మారు. కానీ షెహజాదా సినిమా చేస్తుండటంతో కొన్ని రోజులు వాయిదా వేయాలని, యూట్యూబ్ లో అప్పుడే రిలీజ్ చేయొద్దని నిర్మాణ సంస్థలు కోరడంతో గోల్డ్ మైన్స్ ఆగింది. కానీ ఇది జరిగి సంవత్సరం దాటేస్తుంది.

Vijay Kiragandur : కాంతార అందుకే ఆస్కార్ కి వెళ్ళేలేదు.. కాంతార 2ని తీసుకెళతాం..

షెహజాదా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వక వాయిదా పడుతూ వస్తుండటంతో ఇంక గోల్డ్ మైన్స్ ఛానల్ ఆగలేదు. అలవైకుంఠపురం సినిమా హిందీ వర్షన్ ని తమ ఛానల్ లో ఫిబ్రవరి 2 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో షెహజాదా సినిమాకి గట్టి షాక్ తగిలింది. అలవైకుంఠపురంలో సినిమా హిందీ వర్షన్ ఫిబ్రవరి 2న యూట్యూబ్ లో విడుదలైతే దాని రీమేక్ షెహజాదా సినిమా ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమాకి వచ్చే ప్రేక్షకులు తగ్గుతారని అంతా భావిస్తున్నారు. షెహజాదా సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్ కూడా భాగమయ్యాడు. ఒకవేళ అలవైకుంఠపురంలో సినిమా హిందీ వర్షన్ వల్ల షెహజాదా కి కలెక్షన్స్ తగ్గితే వాళ్ళ సినిమా వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ పడటం ఖాయం. మరి ఏమవుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు