స్టైలిష్ స్టార్ చిల్డ్రన్స్ డే సర్‌ప్రైజ్

చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14 ఉదయం 10 గంటలకు ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓఎంజీ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు..

  • Publish Date - November 13, 2019 / 11:44 AM IST

చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14 ఉదయం 10 గంటలకు ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓఎంజీ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి..

ఇప్పుడు ఈ సినిమాలోని మూడో పాట విడుదల చేయనున్నారు. చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14 ఉదయం 10 గంటలకు ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓఎంజీ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరో విశేషం ఏంటంటే ఈ పాటను ఇద్దరు స్పెషల్ గెస్ట్‌లు రిలీజ్ చేయనున్నారట.

Read Also : ‘యాక్షన్’ సెన్సార్ పూర్తి – రెండున్నర గంటలు విశాల్ విధ్వంసమే

ఆ అతిథులు ఎవరు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే మరి. ప్పటికే రెండు పాటలతో రచ్చ లేపిన థమన్.. మూడో పాట ఎలా కంపోజ్ చేసుంటాడా అని బన్నీ ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.