గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్ : ‘అల వైకుంఠపురములో’ – టీజర్ అప్‌డేట్

డిసెంబర్ 11వ తేదీన ‘అల వైకుంఠపురములో’ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు..

  • Publish Date - December 9, 2019 / 09:30 AM IST

డిసెంబర్ 11వ తేదీన ‘అల వైకుంఠపురములో’ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి..

‘ఓ మైగాడ్ డాడీ’ పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్.. డిసెంబర్ 11వ తేదీన ‘అల వైకుంఠపురములో’ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు.

డిసెబంర్ 9వ తేదీ సాయంత్రం టీజర్ గ్లింప్స్ విడుదల కానుంది. టబు, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సునీల్, సుశాంత్, నవదీప్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.