Alia Bhatt : బ్రదర్ కోసం పోరాడబోతున్న అలియా భట్..

ఇటీవలే నేషనల్ అవార్డుని గెలుచుకున్న అలియా భట్ తన కొత్త సినిమాని ప్రకటించింది. బ్రదర్ కోసం పోరాటం..

Alia Bhatt announce his next movie Jigra with Vasan Bala

Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించింది. ఈ ఏడాది అలియా రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాటిలో ఒక బాలీవుడ్ మూవీ, మరొకటి హాలీవుడ్ మూవీ. రణ్‌వీర్ సరసన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ సినిమాలో నటించి సూపర్ హిట్టుని అందుకుంది. ఇక అలాగే హాలీవుడ్‌ నటి గాల్ గాడోట్ నటించిన యాక్షన్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) లో ఒక ముఖ్య పాత్ర చేసింది. ఈ సినిమాలో అలియా కూడా యాక్షన్ స్టంట్స్ చేసి అదరగొట్టింది.

Tiger Nageswara Rao : ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసిన టైగర్ నాగేశ్వరరావు..

ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలో కూడా యాక్షన్ స్టంట్స్ చేయబోతోందని తెలుస్తుంది. వాసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే ఒక మూవీని అనౌన్స్ చేసింది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది. ఇక ఈ మూవీ అనౌన్స్ చేస్తూ ఒక యానిమేషన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్ తోనే మూవీ స్టోరీని కూడా ప్రేక్షకులకు తెలియజేశారు. “సోదరుడికి రాఖీ కట్టడం అంటే అతనికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటాను అనే చేసే ప్రమాణం. నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం” అంటూ మోషన్ పోస్టర్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Nithya Menen : తమిళ్ యాక్టర్ నన్ను వేధించాడు.. వైరల్ అవుతున్న నిత్యా మీనన్ కామెంట్స్.. నిజమెంత..?

ఈ వీడియో చూస్తుంటే.. అలియా తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఈ సినిమాలో పోరాడబోతుందని అర్ధమవుతుంది. ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రకటించేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్ మరియు సోమెన్ మిశ్రా నిర్మించబోతున్నారు. కాగా అలియా ఇటీవలే ‘గంగూబాయి కతియావాడి’ సినిమాకు గాను నేషనల్ అవార్డుని అందుకుంది. ఆ మూవీ కూడా లేడీ ఓరియంటెడ్ స్టోరీతోనే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహాలో వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.