Alia Bhatt
Alia Bhatt: ఆలియా భట్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ షార్డ్ పీరియడ్ లోనే దీపికా పడుకోన్, ప్రియాంకా చోప్రా కన్నా ఎక్కువ సంపాదిస్తూ.. హయ్యస్ట్ ఎర్నింగ్ విమెన్ గా ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది. ఎంతగా అంటే వాళ్ల నాన్న స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ 50 ఏళ్లలో సంపాదించింది ఆలియా జస్ట్ రెండేళ్లలోనే సంపాదించేంతగా.
Puneeth Rajkumar: గతేడాది చిరంజీవి.. ఇప్పుడు పునీత్.. కన్నడ సినిమాకేమైంది?
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఆలియా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. సోకాల్డ్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి సినిమాల విషయంలో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూనే ఉంది. అందుకే నంబర్ ఆఫ్ సినిమాలు చేస్తూ.. తన రూటే సెపరేట్ అని ప్రూవ్ చేసుకుంటోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తండ్రిని మించి ఆస్తి సంపాదించేసింది.
Sonal Chauhan: సొగసులతో కవ్విస్తోన్న ఆగ్రా అందగత్తె!
స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన మహేష్ భట్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆలియా భట్ గానే ఆడియన్స్ కి ఎక్కువ రిజిస్టర్ అయ్యింది. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి వరుసగా సినిమాలు చేస్తున్న ఆలియా రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటోంది. తను 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన దాన్ని ఆలియా జస్ట్ రెండేళ్లలోనే సంపాదించిందని అలియా తండ్రి తన కూతురి గ్రోత్ ని చూసి తెగ మురిసిపోతున్నారు.
Pranitha Subhash: కుర్రకారు మెచ్చిన బాపుబొమ్మ ప్రణీత!
మహేష్ భట్ తన కూతురు ఆలియా డెడికేషన్, ఫైర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఆలియా చిన్నప్పుడు 500 కోసం కాళ్లకు క్రీమ్ రాసేదట, చిన్నప్పటి నుంచి డబ్బులు సేవ్ చేసుకుని, అనవసరంగా దేనికీ ఖర్చు పెట్టకుండా మనీ మేనేజ్ చేసేదని మహే్ష్ భట్ అంటున్నారు. అందుకే జస్ట్ రెండేళ్లలోనే.. తండ్రి 50 ఏళ్లు కష్టపడి సంపాదించినంత సంపాదించేసింది. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర, ట్రిపుల్ ఆర్, గంగూభాయ్ కతియావాడి లాంటి సాలిడ్ సినిమాలతో బిజీగా ఉంది ఆలియా.