‘ఆర్ఆర్ఆర్’ కోసం పదిరోజుల కాల్షీట్‌కు గానూ భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్న ఆలియా భట్..
దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. ‘రౌద్రం రుణం రుధిరం’(ఆర్ఆర్ఆర్).. ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చెర్రీతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జతకడుతోంది. ఇటీవల డేట్స్ అడ్జస్ట్ అవకపోవడం వలన ఆలియా ఈ చిత్రం నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ కొత్త అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమాలోని పాత్ర కోసం ఆలియాకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే తదుపరి షెడ్యూల్ కోసం ఆలియా పది రోజుల కాల్షీట్‌ను కేటాయించిందట. ఈ పది రోజులకు ఆమె అక్షరాలా రూ.5కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అంటే రోజుకు యాబై లక్షల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నట్లన్నమాట.
Read Also : సల్లూ భాయ్ గడ్డి తిన్నాడు.. అనుపమ అకౌంట్ హ్యాక్.. ఫోటోలు మార్ఫింగ్..
అంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ అవసరమా?.. అనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి ఫిల్మ్ వర్గాల్లో. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న పది భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రే స్టీవెన్ సన్, ఎలిసన్ డూడీ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.