ఇల్లు కొనుక్కోమ‌ని డ్రైవ‌ర్‌కి, స‌హాయ‌కుడికి 50 ల‌క్ష‌లు ఇచ్చిన నటి..

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 09:07 AM IST
ఇల్లు కొనుక్కోమ‌ని డ్రైవ‌ర్‌కి, స‌హాయ‌కుడికి 50 ల‌క్ష‌లు ఇచ్చిన నటి..

అందాల భామ అలియా భట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ప్రయాణం ప్రారంభించి కొద్ది కాలమే అవుతున్నా..వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆమెకు అందం ఒక్కటే కాదండి మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు అలియా. 26వ పుట్టిన రోజు సందర్భంగా అలియా తన వ్యక్తిగత సహాయకుడు, అయితే ఇటీవ‌ల త‌న బాయ్ ఫ్రెండ్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు చిన్న‌నాటి ఫ్రెండ్స్‌తో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న అలియా, పుట్టిన రోజుకి ముందు త‌న డ్రైవ‌ర్‌తో పాటు స‌హాయ‌కుడికి చెరో 25 లక్షల రూపాయల సాయం చేశారనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ప్రాంతంలో ఇల్లు కొనుక్కోమ‌ని చెప్పింద‌ట‌.  

ఇప్పటికే వీరిద్దరు జుహూ, ఖాన్‌ దందా ప్రాంతంలో ఇళ్లను బుక్‌ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి వీరు ఇద్దరు తన దగ్గరే పని చేస్తున్నారని.. వారి పట్ల తనకు గల ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి అలియా ఇలా చేశారని తెలిసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌స్త్రా, ఇన్షా అల్లా, క‌ళంక్‌, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రాల‌తో బిజీగా ఉంది అలియా.