Alia Bhatt : యాక్టింగ్ గురించి సలహా అడిగితే.. రాజమౌళిపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రతి సంవత్సరం లాగే టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో చోటు సాధించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించడంతో అభిమానులు, నెటిజన్లు. పలువురు ప్రముఖులు రాజమౌళిపై అభినందనలు కురిపిస్తున్నారు.

Alia Bhatt interesting comments on Rajamouli

Alia Bhatt :  బాహుబలి(Bahubali) సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించి, ఆ తర్వాత RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు రాజమౌళి(Rajamouli). ఇప్పుడు రాజమౌళితో కలిసి పనిచేయడానికి అన్ని సినీ పరిశ్రమ వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్(Bollywood) వాళ్ళు రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలు అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రాజమౌళి తాజాగా 2023 సంవత్సరానికి టైమ్స్(Times) ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ లో చోటు సంపాదించాడు.

 

ప్రతి సంవత్సరం లాగే టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో చోటు సాధించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించడంతో అభిమానులు, నెటిజన్లు. పలువురు ప్రముఖులు రాజమౌళిపై అభినందనలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ భామ అలియా భట్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందిస్తూ రాజమౌళిని పొగిడేసింది. అలియా RRR సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అలియా భట్ మీడియాతో మాట్లాడుతూ.. నేను మొదటిసారి రాజమౌళిని బాహుబలి సినిమా ప్రీమియర్స్ లో కలిశాను. సినిమా చూస్తున్నంతసేపు మేము ఆశ్చర్యపోయాము. సినిమా చూశాక ఈ డైరెక్టర్ తో ఎలాగైనా వర్క్ చేయాలి అనుకున్నాను. RRR సినిమాతో నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే స్కూల్ కి వెళ్ళినట్టే, చాలా అంశాలు తెలుసుకోవచ్చు. రాజమౌళి మన అందర్నీ ఒక చోటికి చేర్చారు. ఇండియన్ సినిమాతో అందర్నీ ఒకటి చేశాడు. నేను అతన్ని మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను అని తెలిపింది.

Rajamouli : వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ లిస్ట్‌లో రాజమౌళి పేరు..ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించిన జక్కన్న..

రాజమౌళి తనకు చెప్పిన సలహా గురించి మాట్లాడుతూ.. ఓ సారి రాజమౌళిని యాక్టింగ్ గురించి సలహా అడిగాను. అప్పుడు రాజమౌళి మీరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా దాన్ని ప్రేమతో చేయండి, ఎందుకంటే సినిమా ఫెయిల్ అయినా మీ క్యారెక్టర్ మాత్రం జనాల్లో మిగిలిపోతుందని చెప్పారు అంటూ తెలిపింది. ఇక రాజమౌళిపై టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్, దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.