RRR షూటింగులో జాయిన అయిన అజయ్ దేవ్‌గన్

ఆర్ఆర్ఆర్ - మంగళవారం నుండి షూటింగులో పాల్గొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్..

  • Publish Date - January 21, 2020 / 05:37 AM IST

ఆర్ఆర్ఆర్ – మంగళవారం నుండి షూటింగులో పాల్గొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్..

ఆర్ఆర్ఆర్.. బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ ఫిలిం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఒలివియా మోరిస్, అలియా భట్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఎలిసన్ డూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మంగళవారం నుండి ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. అజయ్, రాజమౌళితో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : డిస్కో రాజా ఫ్రీకౌట్ -సెన్సార్ టాక్

తారక్, చెర్రీ, అజయ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 2020 జూలై 30న పది భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : కీరవాణి.