Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
కామెడీ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, విలక్షణమైన పాత్రల్లోనూ తన నటనతో ఆడియెన్స్‌ను మెప్పించిన హీరో అల్లరి నరేశ్. గతకొంత కాలంగా కామెడీ...
- Anil Aaleti
- Published On : May 23, 2022 / 07:15 PM IST
Allari Naresh As Teacher In Maredumilli Prajaneekam
Allari Naresh: కామెడీ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, విలక్షణమైన పాత్రల్లోనూ తన నటనతో ఆడియెన్స్‌ను మెప్పించిన హీరో అల్లరి నరేశ్. గతకొంత కాలంగా కామెడీ సినిమాలు కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో తన లాస్ట్ మూవీ ‘నాంది’తో కట్టిపడేశాడు. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్, తన తాజా చిత్రం ‘‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’’ను ఇటీవల ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Allari Naresh : అల్లరి నరేష్ కొత్త సినిమా ముహూర్తం
అయితే ఈ సినిమాతో మరోసారి అల్లరి నరేశ్ తనలోని విలక్షణ నటుడిని బయటకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లిలో ఎలక్షన్ డ్యూటీకి వెళ్లే ఓ ప్రభుత్వ టీచర్ పాత్రలో అల్లరి నరేశ్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ మరోసారి సీరియస్ పాత్రలో నటిస్తుండటంతో ‘మారేడుమిల్లి ప్రజానీకం’పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Naresh59: అల్లు నరేష్ కొత్త సినిమా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’!
ఈ సినిమాను ఏఆర్.మోహన్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ‘మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అల్లరి నరేశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
