Allari Naresh : ‘నా నెక్స్ట్ రెండు సినిమాలు అవే’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అల్లరి నరేష్

అల్లరి నరేష్.. ఎన్నో కామెడీ సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Allari Naresh gave an exciting update on his next two films

Allari Naresh : అల్లరి నరేష్.. ఎన్నో కామెడీ సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సరికొత్త కథలతో, కామెడీని సరికొత్తగా చూపించాడు నరేష్. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసినప్పటికి ఇప్పుడు మాత్రం చెయ్యడం లేదు. ప్రస్తుతం సీరియస్, యాక్షన్ కథలను ఎంచుకుంటున్నాడు.

Also Read : Jason Sanjay 01 : టాలీవుడ్ హీరోతో డైరెక్టర్ గా దళపతి కొడుకు ఎంట్రీ.. ఫస్ట్ మూవీ మోషన్ పోస్టర్ అదిరిందిగా

అయితే ఈ హీరో చేస్తున్న లేటెస్ట్ సినిమా బచ్చల మల్లి. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కావడానికి రెడీ గా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. ఇప్పటివరకు కామెడీ సినిమాతో అలరించిన నరేష్ నాందీ సినిమాతో రూటు మార్చారు. మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో తనలోని యాక్షన్ బయటికి తీశారు.


అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అల్లరి నరేష్ మాట్లాడుతూ..” ఇప్పుడు కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి అని రిపోర్టర్ అడిగితే.. నా నెక్స్ట్ రెండు సినిమాలు కామెడీ సినిమాలే అని బదులిచ్చాడు నరేష్. అలాగే.. నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలు కామెడీ, ఆ తర్వాత 2026లో సుడిగాడు 2 ఉంటుందని” తెలిపారు. ఇక గతంలో వచ్చిన సుడిగాడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2012లో కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానుంది. మరి సీక్వెల్ కూడా పార్ట్ వన్ లాగా మంచి కామెడీ పండిస్తుందా లేదా చూడాలి.