Jason Sanjay 01 : టాలీవుడ్ హీరోతో డైరెక్టర్ గా దళపతి కొడుకు ఎంట్రీ.. ఫస్ట్ మూవీ మోషన్ పోస్టర్ అదిరిందిగా

జాసన్ సంజయ్ కి డైరెక్షన్ అంటే ఇష్టం. అందుకే ఇతడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

Jason Sanjay 01 : టాలీవుడ్ హీరోతో డైరెక్టర్ గా దళపతి కొడుకు ఎంట్రీ.. ఫస్ట్ మూవీ మోషన్ పోస్టర్ అదిరిందిగా

Thalapathy Vijay son Jason Sanjay 01 Motion Poster Release

Updated On : November 29, 2024 / 6:02 PM IST

Jason Sanjay 01 : తమిళ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ది గోట్’ సినిమాతో పలకరించారు. ఇక ఇప్పుడు తన చివరి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత సినిమాలను పూర్తిగా ఆపేసి రాజకేయాలకే పరిమితం అవ్వాలనుకుంటున్నాడు దళపతి.

Also Read : Samantha : తీవ్ర విషాదంలో సమంత.. తండ్రి కన్నుమూత..

అయితే ఈయన కొడుకు జాసన్ సంజయ్ సైతం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా మాత్రం కాదు. మొదటి నుండి జాసన్ సంజయ్ కి డైరెక్షన్ అంటే ఇష్టం. అందుకే ఇతడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈయన దర్శకత్వం లో వస్తున్న సినిమాలో టాలీవుడ్ యంగ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో.. హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ జాసన్ సంజయ్
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు, తమిళంలో రానున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.