Allari Naresh grandfather Eedara Venkata Rao passed away.
టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాత ఈదర వెంకట్ రావు(90) సోమవారం (జనవరి 19) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉందయం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లరి నరేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kriti Sanon: ట్రెడిషనల్ వియర్ లో ట్రెండీ లుక్స్.. కృతి క్యూట్ ఫొటోలు
ఇక వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019, మే 27న స్వర్గస్థులయ్యారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు, దివంగత ఈవీవీ సత్యనారాయణ, రెండో కుమారుడు ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి. శ్రీనివాస్. కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ. ఇక ఈదర వెంకట్ రావు అంత్యక్రియలు నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరుగనున్నాయి.