Site icon 10TV Telugu

Allari Naresh: తన కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇదే అంటోన్న అల్లరి నరేశ్

Allari Naresh Says Ugram Movie Will Be His Career Best Grossing Film

Allari Naresh Says Ugram Movie Will Be His Career Best Grossing Film

Allari Naresh: టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ రేపు(మే 5) ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాంది’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Allari Naresh : కామెడీ చేసేవాళ్ళంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది.. అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు..

ఇక ఈసారి ఓ పవర్‌ఫుల్ కాప్ డ్రామా మూవీతో మనముందుకు వస్తున్న అల్లరి నరేశ్, ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయనకు ఈ సినిమాపై ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం అవుతోంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని.. ఈ సినిమా హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించే మూవీగా తన కెరీర్‌లో నిలిచిపోతుందని అల్లరి నరేశ్ కామెంట్ చేశాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేశాడు ఈ అల్లరి హీరో.

Ugram Movie: క్రిస్పీ రన్‌టైమ్‌తో వస్తున్న ఉగ్రం.. ఎంతంటే..?

కాగా, ఈ సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుందని, ఈ మూవీలోని కంటెంట్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ సినిమాలో అందాల భామ మిర్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి నిజంగానే అల్లరి నరేశ్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా ఉగ్రం నిలుస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది.

Exit mobile version