Ugram Movie: క్రిస్పీ రన్‌టైమ్‌తో వస్తున్న ఉగ్రం.. ఎంతంటే..?

అల్లరి నరేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’ రిలీజ్ కు రెడీ కావడంతో ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Ugram Movie: క్రిస్పీ రన్‌టైమ్‌తో వస్తున్న ఉగ్రం.. ఎంతంటే..?

Ugram Movie Locks Runtime

Ugram Movie: అల్లరి నరేశ్ కామెడీ సినిమాలు చేసి ఎంత పాపులర్ అయ్యాడో, అవే రొటీన్ కామెడీ కంటెంట్‌తో అంతే ఫెయిల్యూర్‌ను చూశాడు. ఇక కామెడీ సినిమాలను పక్కనబెట్టి సీరియస్ పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న ఈ యంగ్ హీరో.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు ఇదే కోవలో మరో సీరియస్ కంటెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు ఈ హీరో.

Ugram Movie: ఏలూరులో ‘ఉగ్రం’ మూవీ టీమ్ ప్రెస్‌మీట్.. ఫోటోలు!

‘ఉగ్రం’ అనే పవర్‌ఫుల్ కాప్ డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన అల్లరి నరేశ్, ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్.. ‘ఉగ్రం’ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ‘నాంది’ సినిమాను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఉగ్రం మూవీని కూడా తెరకెక్కిస్తుండటంతో మరోసారి ఈ కాంబినేషన్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. కాగా, ఈ సినిమాను మే 5న రిలీజ్‌కు రెడీ చేసిన చిత్ర యూనిట్, సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది.

Ugram Movie: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ట్రైలర్ లాంచ్ ఫోటోలు

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయగా, ఈ మూవీ రన్‌టైమ్‌ను చాలా క్రిస్పీగా లాక్ చేసింది చిత్ర యూనిట్. పూర్తిగా సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 2 నిమిషాలకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈమధ్య కాలంలో ఇలాంటి క్రిస్పీ రన్‌టైమ్‌తో తెలుగు సినిమాలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ మిర్నా హీరోయిన్‌గా నటిస్తోండగా శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.