Alli Simson
Swimming Pool: నటి, గాయని అయిన అల్లీ సింప్సన్ స్విమ్మింగ్ పూల్ లోకి దూకి మెడ విరగ్గొట్టుకుంది. దీంతో న్యూ ఇయర్ సాయంత్రమే ఆమె బెడ్ కే అంకితం కావాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం పాప్ స్టార్ కొడీ సింప్సన్ ఈ ప్రమాదం గురించి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది.
కొద్ది పాటి సర్జరీ మాత్రమే అవసరమైందని పెద్ద ప్రమాదం తప్పిందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనిపై నటి అల్లీ.. ‘అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. న్యూరో సర్జన్ సూచన మేరకు వెంటనే సర్జరీ జరపాల్సి వచ్చింది. మరో నాలుగు నెలల వరకూ 24గంటలూ ఈ మెడ పట్టీతోనే ఉండాలి. చిన్న గాయంతో బయటపడినందుకు సంతోషిస్తున్నా. జీవితాంతం బాధపడే ఘటన కంటే నాలుగు నెలల రెస్ట్ పెద్ద ఇబ్బంది కాదనుకుంటున్నా’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది.
ఆ తర్వాత న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. ‘వంట చేసుకోవడం, ఫ్రెండ్స్ కు గిఫ్ట్ లు పంపడమే పెద్ద విషయం. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్. నాలా కాకుండా మీ అందరికీ మంచి జరగాలి. లోతు తెలియకుండా దేనిలోనూ దూకకండి’ అని ముగించింది.
హాలీవుడ్ లో నటించడమే కాకుండా పాటలు కూడా పాడుతుంటారు అల్లీ సింప్సన్. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్‌బుక్‌లో మిలియన్ లైక్స్, ట్విట్టర్ లో 1.2 మిలియన్ ఫాలోవర్లు, యూట్యూబ్ లో హాఫ్ మిలియన్ సబ్‌స్క్రైబర్లతో ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు అల్లీ.