Allu Kanakaratnam is the reason behind Pawan Kalyan's entry into films
Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజున హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం అల్లు అరవింద్(Allu Aravind) ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తల్లిగారి గొప్పతనం గురించి మీడియాతో పంచుకోవాలని చెప్పుకొచ్చారు.
Bigg Boss Season 9: గుండు అంకుల్, బాడీ షేమింగ్.. మాస్క్ మ్యాన్ కి మండింది.. పాపం ఇమ్మాన్యుయేల్!
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, అల్లు కనకరత్నం మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ని అల్లు కనకరత్నం ముద్దుగా కల్యాణి అని పిలుచుకునేవారట. పవన్ కళ్యాణ్ సినిమాలోకి రాకముందు చక్కగా ఉన్నావ్ నువ్వు కూడా సినిమాలు చేయోచ్చు కదా అంటూ చెప్పేవారట. దానికి పవన్ కళ్యాణ్ నాకు ఇబ్బంది, సిగ్గు అని చెప్పేవాడట. ఆలాగే అల్లు అరవింద్ తో కూడా కళ్యాణ్ తో సినిమా చేయమని చెప్పేవారట. ఈ విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేశాడు అల్లు అరవింద్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.