Allu Aravind : హీరోల రెమ్యునరేషన్స్, సినిమాల ఖర్చుపై అల్లు అరవింద్ కామెంట్స్..

ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి అల్లు అరవింద్ ని.. గతంలో లాగా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఎక్కువగా రావట్లేదు ఎందుకు అని ప్రశ్నించగా............

Allu Aravind Comments on Heros Remuneration and Movie Production Cost

Allu Aravind : రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్(Shivani Rajashekar) లీడ్‌ రోల్స్‌లో శ్రీకాంత్(Srikanth), వరలక్ష్మీ శరత్‌ కుమార్(Varalaxmi Sarath Kumar) ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్‌’(Kota Bommali PS). తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘లింగి లింగి లింగిడి’ అనే ఫోక్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్, అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చారు.

టీజర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్రయూనిట్, అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానము ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి అల్లు అరవింద్ ని.. గతంలో లాగా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఎక్కువగా రావట్లేదు ఎందుకు అని ప్రశ్నించగా ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల అని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. అయితే హీరోల రెమ్యునరేషన్స్ వల్ల ఖర్చు పెరుగుతుందా అని ప్రశ్నించారు.

Also Read : Swetaa Varma : బిగ్‌బాస్ శ్వేతావర్మ ఇంట్లో అగ్నిప్రమాదం.. మేం క్షేమంగా ఉన్నాం కానీ..

దీనికి అల్లు అరవింద్ సమాధానమిస్తూ.. పెద్ద సినిమాలు రెగ్యులర్ గా తీయకపోవడానికి ఖర్చు కారణం. సినిమాకు పెరిగిన ఖర్చులో హీరోలు తీసుకునేది కేవలం 20 శాతం మాత్రమే. హీరోల వల్ల సినిమా ఖర్చు పెరుగుతుంది అనేది తప్పు. ఖర్చు ఎక్కువ పెట్టి తీస్తున్న పెద్ద సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అనేది కరెక్ట్. కొన్ని సినిమాలు ఉన్నాయి.. పేర్లు చెప్పను.. అందులో సినిమా ఖర్చు ఎంత ఎక్కువ ఉంది, అందులో హీరో రెమ్యునరేషన్ ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. హీరోల వల్ల సినిమా ఖర్చు పెరిగి పెద్ద సినిమాలు తక్కువ వస్తున్నాయి అనేది నిజం కాదు. పెద్ద సినిమాలని మరింత పెద్దగా చూపిస్తే తప్ప సినిమాలకు రావట్లేదు ఆడియన్స్. ఉదాహరణకు KGF ముందు యశ్ కన్నడ తప్ప బయటి వాళ్లకు తెలీదు. కానీ సినిమాని పెద్దగా చేసి ప్రమోట్ చేశారు కాబట్టి అతని గురించి అందరికి తెలిసింది అని అన్నారు.