×
Ad

Allu Aravind: మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న అల్లు అరవింద్.. త్వరలో రాబోతున్నట్టు ప్రకటన!

మహాభారతం.. భారతదేశ ఇతిహాసాల్లో ఈ కథ ఒక అద్భుతం. హిందూ పురాణాలు బట్టి 'వ్యాసుడు' అనే మహర్షి ద్వాపరయుగంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మహాభారత కథని రాసినట్టు చెబుతారు. రాజమౌళి కూడా ఈ కథని సినిమాగా తెరకెక్కించాలన్నది తన కలంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇంతలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక ప్రకటన చేశారు.

  • Published On : September 10, 2022 / 03:55 PM IST

Allu Aravind Making Maha Bharatam

Allu Aravind: మహాభారతం.. భారతదేశ ఇతిహాసాల్లో ఈ కథ ఒక అద్భుతం. హిందూ పురాణాలు బట్టి ‘వ్యాసుడు’ అనే మహర్షి ద్వాపరయుగంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మహాభారత కథని రాసినట్టు చెబుతారు. కౌరవులు, పాండవులు మధ్య జరిగే కథలో.. ఎన్నో కుతంత్రాలు, మలుపులు, చిక్కులు, అన్నిటికిమించి కురుక్షేత్ర యుద్ధం. ఇవ్వన్ని కలిసి ఆ మహాభారతం కథను “మాస్టర్ అఫ్ అల్ స్టోరీస్” అనేలా చేసింది.

Rajmouli: బ్రహ్మాస్త్ర మూవీ స్టోరీ చెప్పేసిన రాజమౌళి..

ఇక ఈ కథని సినిమాగా తెరకెక్కించాలన్నది భారతదేశ ప్రతి దర్శకుడికి ఉండే కల. ఆ కోవలోకే మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా వస్తాడు. ఇప్పటికే అయిన చాలా సందర్భాల్లో మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ కథని తాను చివరగా తీసే సినిమాగా తెరకెక్కించాలన్నది అయన కోరిక. అయితే ఇంతలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక ప్రకటన చేశారు.

“ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప ఇతిహాసం మహాభారతం. మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడింది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం ఎదురుచూస్తూ ఉండండి, త్వరలో వస్తోంది హాట్ స్టార్ లో” అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ, ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఇందులో ఎవరు నటిస్తున్నారు, ఎవరు తీస్తున్నారు, ఎప్పుడు మొదలైంది అనే ఏ విషయాలు తెలుపలేదు. పోస్ట్ చేసిన ఫోటోలు బట్టి చుస్తే, యానిమేటెడ్ తరహాలో ఈ కథ తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది.