RRR TRP: అక్కడ ఆకట్టుకోలేకపోయిన ఆర్ఆర్ఆర్..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లేలా తన సత్తా చాటింది. ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో తుక్కురేపింది. అయితే ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా, ఇప్పుడు ఒక్కచోట మాత్రం ప్రేక్షకులను అలరించడంలో పెద్దగా సక్సెస్ కాలేదు.

RRR TRP: అక్కడ ఆకట్టుకోలేకపోయిన ఆర్ఆర్ఆర్..?

Shocking TRP For RRR

RRR TRP: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

RGV Comments on RRR Movie : RRR సినిమా చూస్తున్నంతసేపు సర్కస్ గుర్తొచ్చింది.. మరోసారి RRRపై ఆర్జీవీ వ్యాఖ్యలు

అయితే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లేలా తన సత్తా చాటింది. ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో తుక్కురేపింది. ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయగా, అక్కడ కూడా ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా గురించి భాషతో సంబంధం లేకుండా అందరూ చర్చించుకునేలా చేసింది. అయితే ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా, ఇప్పుడు ఒక్కచోట మాత్రం ప్రేక్షకులను అలరించడంలో పెద్దగా సక్సెస్ కాలేదు.

RRR In Saturn Awards: అమెరికా అవార్డుల్లో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడింట్లో..!

అవును.. ఆర్ఆర్ఆర్ సినిమాను ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టీవీలో టెలికాస్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ అనుకున్న స్థాయిలో మాత్రం రాలేదు. కనీసం టాప్ 10 టీఆర్పీ రేటింగ్స్ లో కూడా దీనికి స్థానం దక్కలేదు. కేవలం 19.62 టీఆర్పీ రేటింగ్ తో తెలుగులో ఈ సినిమా డీసెంట్ గా నిలిచింది. అయితే మలయాళంలో మాత్రం ఆర్ఆర్ఆర్ తన స్టామినా ఏమిటో చూపించింది. మలయాళంలో డబ్ అయిన తెలుగు చిత్రాల్లోనే ఆర్ఆర్ఆర్ టాప్ స్థానంలో నిలిచింది. ఏకంగా 13.70 టీఆర్పీతో మలయాళంలో ఈ సినిమా దుమ్ములేపింది. మరి తెలుగు ఆడియెన్స్ కు ఆర్ఆర్ఆర్ టీవీలో ఎందుకు కనెక్ట్ కాలేదా అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.