RRR In Saturn Awards: అమెరికా అవార్డుల్లో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడింట్లో..!
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం చోటు దక్కించుకుని ఔరా అనిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు విభాగాల్లో నామినేట్ అయ్యి ఆర్ఆర్ఆర్ ఇండియన్ మూవీ సత్తా చాటింది.

RRR In Saturn Awards Get 3 Nominations
RRR In Saturn Awards: దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి తెలుగు సినిమా పవర్ ఏమిటో చూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తరువాత యావత్ ప్రపంచం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది.
RRR: గెట్ రెడీ జపాన్.. ఆర్ఆర్ఆర్ వచ్చేస్తోంది!
అయితే తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం చోటు దక్కించుకుని ఔరా అనిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు విభాగాల్లో నామినేట్ అయ్యి ఆర్ఆర్ఆర్ ఇండియన్ మూవీ సత్తా చాటింది. అంతర్జాతీయ చిత్రం, ఫిల్మ్ డైరెక్షన్, యాక్షన్/అడ్వెంచర్ మూవీ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం నామినేట్ అయ్యింది.
RRR : ఇలాంటి ఎంట్రీ ఎప్పుడూ చూడలేదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో
ఇలా హాలీవుడ్‌లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, హార్రర్, ఫాంటెసీ చిత్రాలకు అవార్డులనిచ్చే శాటర్న్ అమెరికన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చోటు సాధించడంతో పలువురు సెలబ్రిటీలు ట్రిపుల్ఆర్ ఫిల్మ్ మేకర్స్‌ను అభినందిస్తున్నారు. ఈ సినిమాను మాస్టర్ పీస్‌గా మలిచిన రాజమౌళికి శాటర్న్ అవార్డుల్లో ఖచ్చితంగా అవార్డు వస్తుందని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది నిజంగా టాలీవుడ్ గర్వించే విషయమని పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3 Nominations @SaturnAwards for @RRRMovie ???
– Film Direction
– Action / Adventure Film
– International FilmCongrats to our team RRR
Thanks @SaturnAwards @ssrajamouli @tarak9999@AlwaysRamCharan https://t.co/BVEgKtao7J
— Srinivas Mohan (@srinivas_mohan) August 13, 2022