Vaishnavi Chaitanya : బేబీ విడుదలకు ముందే వైష్ణవికి సినిమా ఆఫర్ చేసిన అల్లు అరవింద్.. లేడీ ఓరియెంటెడ్ కథ..!
బేబీ సినిమాతో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే అల్లు అరవింద్, వైష్ణవికి ఒక లేడీ ఓరియెంటెడ్ కథ..
- gum 95921
- Published On : July 18, 2023 / 02:34 PM IST
Allu Aravind offered movie to Vaishnavi Chaitanya before Baby Release
Vaishnavi Chaitanya : తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ అవ్వాలని వచ్చి.. ఎంతో కష్టపడి నేడు హీరోయిన్ గా తన మొదటి సినిమాని వెండితెర పై చూసుకుంది. ఇన్నాళ్లు తనలోని నటనా ప్రతిభ చూపించడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ వెతుకుతున్న వైష్ణవికి బేబీ (Baby) సినిమాతో అద్భుతమైన అవకాశం దొరికింది. దీంతో ఆ మూవీలో తన ప్రాణం మొత్తం పెట్టి యాక్టింగ్ చేసింది.
ఇక సినిమాలో ఆడియన్స్ కి మొన్నటి వరకు చూసిన వైష్ణవి కనిపించలేదు. ఆ మూవీలోని వైష్ణవి అనే పాత్ర మాత్రమే కనిపించింది. అంతలా నటించింది వైష్ణవి చైతన్య. ఇక ఈమె నటనకి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఫిదా అయ్యిపోయాడు. బేబీ మూవీని ఎడిటింగ్ టేబుల్ మీద ఉండగానే, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా చూసిన అల్లు అరవింద్ కి వైష్ణవి యాక్టింగ్ బాగా నచ్చేసింది. దీంతో తనతో ఒక సినిమా తీయాలని అనుకున్నాడట. తన దగ్గర ఒక లేడీ ఓరియెంటెడ్ కథ ఉందట.
Salman Khan : ఒక్క సిగరెట్ ఎఫెక్ట్.. ‘బిగ్‌బాస్’ని వదిలేసిన సల్మాన్ ఖాన్?
ఆ కథకి వైష్ణవి అయితే బాగా చేయగలదని అనుకున్నాడట. దీంతో నిర్మాత బన్నీ వాసుతో వైష్ణవి చైతన్య డేట్స్ తీసుకో ఒక సినిమా ప్లాన్ చేద్దాం అని చెప్పాడట. కానీ బన్నీ వాసు పనిలో పడి అది పెద్దగా పట్టించుకోలేదని.. తాజాగా జరిగిన బేబీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు బేబీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వైష్ణవి చైతన్యని డేట్స్ అడిగితే మమ్మల్ని కూడా క్యూలో నించోపెడుతుందేమో అంటూ సరదాగా మాట్లాడాడు. మరి చైతన్యతో ఆ ప్రాజెక్ట్ ని అరవింద్ పట్టాలు ఎక్కిస్తారా? లేదా? చూడాలి.
