Allu Aravind Speak with Media about Attack on his Home
Allu Aravind : నేడు OU JAC కి చెందిన వారంటూ పలువురు విద్యార్థులు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు, టమాటాలతో దాడి చేసి ఇంట్లోకి దూకి పూల కుండీలు పగలకొట్టారు. ఇంటి ముందు ధర్నా చేసారు. దీంతో పోలీసులు పలువురిని ఈ ఘటనలో అరెస్ట్ చేశారు.
తాజాగా అల్లు అరవింద్ ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే సమయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
ఇక పోలీసులు దాడి గురించి అల్లు అరవింద్ ని, అక్కడి సెక్యూటిరీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసి పంపించాక పోలీసులు కూడా అల్లు అర్జున్ నివాసం నుండి వెళ్లిపోయారు.