Allu Arha : శాకుంతలంలో సింహంపై అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ.. సినిమాలో అర్హ క్యారెక్టర్ ఇదేనా??

శాకుంతలం సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో అల్లు అర్హ నటిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని కూడా గతంలో షేర్ చేశారు. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చివర్లో అర్హ..........

Allu Arha Character in Shakunthalam Movie

Allu Arha :  సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. పురాణాల్లో మేనక-విశ్వామిత్ర కి పుట్టిన శకుంతల పాత్ర ఆధారంగా, శకుంతల, దుశ్యంతుడి కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శకుంతల క్యారెక్టర్ సమంత చేస్తుండగా దుశ్యంతుడి క్యారెక్టర్ మలయాళం నటుడు దేవ్ మోహన్ చేస్తున్నాడు. పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

ఇక శాకుంతలం సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో అల్లు అర్హ నటిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని కూడా గతంలో షేర్ చేశారు. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చివర్లో అర్హ సింహం మీద కూర్చొని వస్తున్న షాట్ ని వేశారు. అయితే మొన్నటి వరకు శకుంతల చిన్నప్పటి క్యారెక్టర్ ని అర్హ నటిస్తుంది అనుకున్నారు. కానీ ట్రైలర్ లో అర్హ ఎంట్రీకి ఇకపై ఈ ఆర్ష ఖండం భరత ఖండంగా మారనుంది అని డైలాగ్ వేశారు. దీంతో అర్హ శకుంతల కొడుకు భరతుడి క్యారెక్టర్ లో కనిపించనుందా అనే సందేహం వస్తుంది.

Samantha : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన సమంత.. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో ఏడ్చేసిన సామ్..

మరి అర్హ ఏ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇవ్వనుందో తెలియాలంటే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ గ్రాండ్ గా సింహం మీద ఎంట్రీ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంతతో పాటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా నాకోసం ఎదురు చూస్తున్నారు.