అల్లు వారి లిటిల్ మదన్ మోహన్ మాలవ్య.. సైరా నరసింహా రెడ్డి..

  • Publish Date - August 15, 2020 / 03:24 PM IST

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బన్నీ. ఈ సందర్భంగా అల్లు అర్హ, అల్లు అయాన్ సరికొత్త గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అర్హ‌, మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా అల్లు అయాన్ కనిపించారు.
మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అర్హ చెబుతున్న‌ సత్యమే వజయతే నినాదం, సైరా గెటప్‌లో గెటవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అంటూ అయాన్ చెప్పిన డైలాగ్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ అల్లు వారి పిల్లల వీడియోలు వైర‌ల్‌గా మారాయి.