Ntr vs Allu Arjun: 2029లో ఇండస్ట్రీని ఏలేది ఈ ఇద్దరే.. వీళ్ళ జాతకాలు ఒక రేంజ్ లో ఉన్నాయట.. నెట్టింట క్రేజీ చర్చ

అల్లు అర్జున్, ఎన్టీఆర్(Ntr vs Allu Arjun) జాతకాల గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun and NTR will rule the Indian film industry In 2029

  • పీక్స్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ జాతకాలు
  • 2029లో ఇండస్ట్రీని ఏలేది ఈ ఇద్దరే
  • ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

Ntr vs Allu Arjun: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న వీరిద్దరి గురించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ప్రముఖ జ్యోతిష్య నిపుణుల విశ్లేషణల ప్రకారం, 2029 నాటికి ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఈ ఇద్దరు స్టార్ హీరోలే శాసిస్తారని, వారి జాతకాలు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ప్రిడిక్షన్స్ నందమూరి, అల్లు(Ntr vs Allu Arjun) అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు సృష్టించగా, ఎన్టీఆర్ RRR, దేవర సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన మేనియాను చూపించారు. అయితే, 2029 నాటికి వీరి గ్రహగతులు అత్యున్నత స్థితికి చేరుకుంటాయని, ఆ సమయంలో వారు చేసే సినిమాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైలురాళ్లుగా నిలుస్తాయని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.

Pawan Kalyan: హరీష్ శంకర్ సూపర్ సక్సెస్.. ఫిదా అయిన పవన్ కళ్యాణ్.. మిగతా దర్శకులకు వార్నింగ్ లాంటిదే!

మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్‌పై వీరి పట్టు మరింత బలపడుతుందని, బాలీవుడ్ అగ్ర హీరోలకు సైతం వీరు గట్టి పోటీనిస్తారని చర్చ జరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ తో ఫుల్ బిజీగా ఉండగా, అల్లు అర్జున్ అట్లీ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ తో మెగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు.

ఈ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి వారి ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుతుందని, జాతక రీత్యా 2029లో వారిద్దరి మధ్యే నెంబర్ వన్ స్థానం కోసం పోటీ ఉంటుందని క్రేజీ ప్రెడిక్షన్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో, నెటిజన్లు సైతం ఈ న్యూస్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, మన తెలుగు హీరోలు దేశవ్యాప్తంగా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.