Allu Arjun : తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని బ‌న్నీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. డిసెంబ‌ర్ 4న పుష్ప‌2 ప్రీమియ‌ర్స్ షో సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సంథ్య థియేట‌ర్ యాజ‌మాన్యంతో పాటు అల్లు అర్జున్ పై ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Pushpa 2 Collections : ‘పుష్ప 2’ క‌లెక్ష‌న్ల జాత‌ర‌.. రూ.1000 కోట్ల క్లబ్‌లో.. ఇప్ప‌ట్లో ఆగేదే లే..

ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు న‌మోదు చేసిన కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్ర‌యించారు.