Pushpa Raj: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. పుష్పరాజ్ వచ్చేశాడు అంటూ వెనుకనుండి బన్నీ నడుస్తున్న పిక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం జుట్టు పెంచి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు స్టైలిష్ స్టార్.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.