×
Ad

Allu Arjun-Atlee: జెట్ స్పీడ్ లో ఫినిష్.. అట్లీ పక్కా ప్లాన్.. అనుకున్నదానికన్నా ముందుగానే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.(Allu Arjun-Atlee) ఈ క్రేజీ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

Allu Arjun-Atlee movie to release earlier than expected

Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో(Allu Arjun-Atlee) భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. పుష్ప 2 లాంటి భారీ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Buchi babu-Shah Rukh: పెద్ది డైరెక్టర్ కి పెద్ద ఆఫర్.. షారుఖ్ ఖాన్ తో సినిమా సెట్.. మైత్రి సంస్థ పక్కా ప్లానింగ్..

అయితే, సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కావడంతో సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయని, వాటికి చాలా సమయం పట్టె అవకాశం ఉందని మేకర్స్ ఇప్పటికే చెప్పేశారు. కాబట్టి, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది అనుకున్నారు అంతా. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనుకున్నదానికన్నా చాలా తొందరగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. దానికి కారణం దర్శకుడు అట్లీ ప్లాన్. అవును, సినిమా మొదలయ్యేనాటికీ 90 శాతం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లేట్ చేశాడట దర్శకుడు. అలాగే మేకింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడట.

టైం ఎక్కువా తీసుకోకుండా తనకు ఎం కావాలో దానిపైనే దృష్టిపెట్టి పక్కాగా అవుట్ ఫుట్ తీసుకుంటున్నాడట. దానివల్ల కూడా అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ షూట్ ను కంప్లీట్ చేస్తున్నారట. కాబట్టి, ఈ సినిమా కోసం అనుకున్న టాకీ పార్ట్ షూటింగ్ తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమా మొదలుపెట్టినప్పుడు 2027లో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, గ్రాఫిక్స్ వర్క్ తొందరగా అందితే 2026 చివర్లోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ న్యూస్ తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.