Allu Arjun
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ తర్వాత అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో వారియర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పేసారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా వర్క్ షాప్ కూడా పూర్తయింది. త్వరలో దుబాయ్ లో ఈ సినిమా షూట్ జరుగుతుందని టాక్.(Allu Arjun)
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీపై క్లారిటీ వచ్చింది.
Also Read : Anand Deverakonda : ఆనంద్ దేవరకొండకు కలిసొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్..?
అల్లు అర్జున్, అట్లీ, అల్లు అరవింద్, ఈ సినిమా టీమ్ కి సంబంధించి కొంతమంది నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ తాజాగా ఓ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి కేవలం తమ సంస్థతో సినిమా డీల్స్ ఉన్న అన్ని సినీ పరిశ్రమల స్టార్స్ ని ఆహ్వానించింది. దీంతో నెట్ ఫ్లిక్స్ లో తమ సినిమాలు ఉన్న నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీకి హాజరయ్యారు. దీంట్లో భాగంగానే అల్లు అర్జున్, అట్లీ హాజరయ్యారు.
దీంతో అల్లు అర్జున్ – అట్లీ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వస్తుందని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కూడా అల్లు అర్జున్ అట్లీ సినిమా నిర్మాణంలో భాగమైంది సమాచారం. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్ కాగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా గెస్ట్ పాత్రలు పోషిస్తారని, అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also See : Netflix Party : నెట్ ఫ్లిక్స్ పార్టీ.. తరలివచ్చిన అన్ని పరిశ్రమల స్టార్స్.. ఫొటోలు..