Anand Deverakonda : ఆనంద్ దేవరకొండకు కలిసొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్..?

లిటిల్ హార్ట్స్ సినిమాకు, ఆనంద్ దేవరకొండ సినిమాకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? (Anand Deverakonda)

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండకు కలిసొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్..?

Anand Deverakonda

Updated On : September 18, 2025 / 7:07 AM IST

Anand Deverakonda : మౌళి, శివాని జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల రిలీజయి భారీ విజయం సాధించింది. ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. లిటిల్ హార్ట్స్ సినిమా కేవలం రెండున్నర కోట్లతో తీస్తే ఏకంగా 32 కోట్లు వసూలు చేసి భారీ ప్రాఫిట్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ వల్ల ఆనంద్ దేవరకొండ సినిమాకు కలిసొచ్చిందా.(Anand Deverakonda)

లిటిల్ హార్ట్స్ సినిమాకు, ఆనంద్ దేవరకొండ సినిమాకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? లిటిల్ హార్ట్స్ నిర్మాత ఆదిత్య హాసన్ దర్శకుడిగా ఆనంద్ దేవరకొండ సినిమా తెరకెక్కుతుంది. ఆదిత్య హాసన్ దర్శకుడిగా 90s సిరీస్, రచయితగా ప్రేమలు, నిర్మాతగా లిటిల్ హార్ట్స్.. ఇలా వరుసగా హిట్స్ కొట్టాడు. దీంతో టాలీవుడ్ లో ఆదిత్య హాసన్ పేరు మారుమోగిపోతుంది.

Also See : Netflix Party : నెట్ ఫ్లిక్స్ పార్టీ.. తరలివచ్చిన అన్ని పరిశ్రమల స్టార్స్.. ఫొటోలు..

ఆదిత్య హాసన్ మంచి కంటెంట్ ఇస్తాడని నమ్మకంతో ప్రస్తుతం ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమాకు భారీ ఓటీటీ డీల్ జరిగిందట. ఆల్మోస్ట్ 11 కోట్లకు ఆనంద్ దేవరకొండ సినిమాని ఓ ఓటీటీ సంస్థ కొనుక్కుందని సమాచారం. దీంతో నిర్మాణ సంస్థ కూడా సంతోషం వ్యక్తం చేసింది. అలా ఆదిత్య హాసన్ వల్ల లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఆనంద్ దేవరకొండకు కలిసొచ్చింది అంటున్నారు.

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. ఆదిత్య హాస‌న్ దర్శకత్వంలో ఈటీవి విన్ ఓటీటీలో వచ్చిన #90’s (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ సినిమా ఉండనుంది అని ఇటీవల తెలిపారు. 90’s సిరీస్‌లో చిన్న‌ పిల్లాడు ప‌ది సంవ‌త్స‌రాల త‌రువాత పెద్ద‌వాడు అయి, అతనికి లవ్ స్టోరీ ఉంటే ఏం జరిగిందనే కథతో ఈ సినిమాని తీస్తున్నారు.

Also Read : Sydney Sweeney : బాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఏకంగా 530 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి..?