Sydney Sweeney : బాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఏకంగా 530 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి..?
ఆమె పాపులారిటీని ఓ బాలీవుడ్ సంస్థ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. (Sydney Sweeney)

Sydney Sweeney
Sydney Sweeney : మన ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ నటీనటులు గతంలో పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ హీరోయిన్ ని బాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ హాలీవుడ్ భామ రెమ్యూనరేషన్.
ఇటీవల హాలీవుడ్ నటి సిడ్నీ స్వీని బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటి జెన్ జెడ్ కి అయితే సిడ్నీ స్వీని బాగా పరిచయం.
ప్రస్తుతం సిడ్నీ స్వీని ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతుంది. దీంతో ఆమె పాపులారిటీని ఓ బాలీవుడ్ సంస్థ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సిడ్నీ స్వీని ని కలిసి ఓ కథ చెప్పి ఇండియన్ సినిమాలో నటించమని అడిగారట. ఇందుకు గాను ఆమెకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట. 415 కోట్లు రెమ్యునరేషన్ రూపంలో మరో 115 కోట్లు స్పాన్షర్ షిప్ అగ్రిమెంట్స్ ద్వారా ఆమెకు ఇస్తామని చెప్పారట. అంటే ఆల్మోస్ట్ ఒక సినిమాకు 530 కోట్లు సిడ్నీ స్వీని కి ఇస్తామని నిర్మాణ సంస్థ ఆఫర్ చేసిందట. దీంతో బాలీవుడ్ లో ఈ విషయం చర్చగా మారింది.
సిడ్నీ స్వీని కి చెప్పిన కథ కూడా ఇదే అని బాలీవుడ్ లో రూమర్ వినిపిస్తుంది. ఓ హాలీవుడ్ హీరోయిన్ ఇండియన్ హీరోతో ప్రేమలో పడినట్టు లవ్ స్టోరీ అంట. ఈ సినిమా షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ లో షూటింగ్ ఉంటుందని కూడా టాక్. దీంతో సిడ్నీ స్వీని బాలీవుడ్ లో నటిస్తుందా అనే రూమర్ తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపై సిడ్నీ స్వీని గాని, బాలీవుడ్ నిర్మాణ సంస్థ కానీ అధికారికంగా స్పందించలేదు. హాలీవుడ్ లో సిడ్నీ స్వీని ఒక సినిమాకు గాను దాదాపు 100 కోట్ల పైగా తీసుకుంటుందని టాక్.
Also Read : OG Movie : భారీగా OG టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ఎంతంటే..?