OG Movie : భారీగా OG టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ఎంతంటే..?
OG సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు భారీగా పెంచారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. (OG Movie)

OG Movie
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్ తోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్లీ ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.(OG Movie)
తాజాగా OG సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఇక OG సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు భారీగా పెంచారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు.
Also See : Priyanka Chopra : నిక్ జోనస్ బర్త్ డే.. భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..
పవన్ కళ్యాణ్ ఓజి సినిమా బెనిఫిట్ షోను 24వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంటకు 1000 రూపాయలు టికెట్ రేట్ తో అనుమతి ఇచ్చారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్ 125 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు పెంచడానికి అనుమతి ఇచ్చారు. మొదటి రోజు అయిదు షోలకు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని జీవో జారీ చేశారు.
దీంతో సినిమాపై హైప్ ఉండటం, దసరా సెలవులు ఉండటం, వేరే ఏ సినిమా లేకపోవడం. ఇవన్నీ కలిసొచ్చి OG సినిమాకు కలెక్షన్స్ భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read : Tunnel : తల్లి అయిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..