Allu Arjun : హీరోలు అవ్వాలంటే డ్యాన్స్ అవసర్లేదు.. తెలుగు హీరోలపై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆనంద్ మాట్లాడేటప్పుడు నాకు డ్యాన్స్ రాదు, మీలాగా చేయలేను, కానీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. దీంతో ఆ వ్యాఖ్యలని ఉద్దేశించి అల్లు అర్జున్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun comments on Movie Heros in Baby Movie Appreciation Meet goes Viral

Allu Arjun :  SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రేక్షకులు మాత్రమే కాక స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ పెట్టాడు.

ఈ ఈవెంట్ లో బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో బన్నీ ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక సినిమాలో పని చేసిన ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ హీరోల గురించి మాట్లాడేటప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బన్నీ. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. వీరిద్దరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. అయితే ఆనంద్ మాట్లాడేటప్పుడు నాకు డ్యాన్స్ రాదు, మీలాగా చేయలేను, కానీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. దీంతో ఆ వ్యాఖ్యలని ఉద్దేశించి అల్లు అర్జున్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun : తెలుగు అమ్మాయిలు సినిమాలు చెయ్యట్లేదు.. అమ్మాయిలూ.. సినిమా ఇండస్ట్రీకి రండి..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. హీరోలు అవ్వాలంటే డ్యాన్స్ అవసర్లేదు. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను చూపించుకుంటున్నాను. ఎవరి ట్యాలెంట్ వాళ్ళకి ఉంటుంది. మీరు మీ లాగే ఉండండి. మీ స్పెషల్ ఏంటో చూపించండి. డ్యాన్సులు, ఫైట్స్ అవసర్లేదు హీరో అవ్వాలంటే. ఎవరి తీరు వాళ్ళది. మనం కష్టపడితే, మన ట్యాలెంట్ ఏంటో మన సినిమాకు తగ్గట్టు చూపిస్తే ఎవరైనా హీరోలు అవ్వొచ్చు. ఈ ఇద్దరు హీరోలు సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆనంద్ తన యాక్టింగ్ తో మెప్పించాడు. విరాజ్ సూపర్ గా కనిపించాడు. నిజంగా కాలేజీలో ఒక తోప్ కుర్రాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించాడు. మీకు అదే స్పెషల్. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేయొచ్చు. అందరూ డ్యాన్సులు, ఫైట్లు చేయనవసరంలేదు అని అన్నారు. దీంతో బన్నీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.