Allu Arjun : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంపై బన్నీ కామెంట్.. మా నాన్న ముందే చెప్పాడంటూ..

ఇక వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వీరికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓ సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Allu Arjun Comments on Varun Tej and Lavanya Tripathi Engagement

Varun – Lavanya :  మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ గత కొంతకాలంగా లవ్ చేసుకొని జూన్ 9న నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వీరికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓ సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి గతంలో కార్తికేయతో కలిసి చావు కబురు చల్లగా అనే సినిమా చేసింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ లోనే చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. లావణ్య ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకొని ఇంత బాగా తెలుగు మాట్లాడుతుంది. ఇక్కడే ఓ తెలుగబ్బాయిని చూసి ఇక్కడ సెటిల్ అయిపో అని అన్నారు. ఇప్పుడు లావణ్య తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోబోతుండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు, పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగబ్బాయిని చూసుకోమంటే ఏకంగా మీ ఇంట్లో అబ్బాయినే చూసుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

Pawan kalyan : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ లుక్ అదిరిపోయిందిగా..

అయితే తాజాగా ఈ వీడియోని అల్లుఅర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. మా నాన్నకి ముందు చూపు ఉంది, ముందే చెప్పాడు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.