Allu Arjun couple with Megastar Chiranjeevi photo goes viral
Allu Arjun- Chiranjeevi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఒకే ఒక్క రాత్రిలో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా పెయిడ్ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందిన విషయానికి గాను అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read : Lavanya Tripathi : పెళ్లి తర్వాత ‘సతీ లీలావతి’గా మెగా కోడలు.. లావణ్య కొత్త మూవీ నుండి అప్డేట్..
ఈ కేసులో నాంపల్లి కోర్డు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు బన్నీ ని తీసుకెళ్లారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా కూడా శుక్రవారం రాత్రి మొత్తం బన్నీ జైలులోనే ఉన్నాడు. శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అవ్వడంతో సినీ సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ ఇంటి బయట క్యూ కట్టారు. ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంటికి మెగా స్టార్ చిరంజీవి చేరుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బన్నీ జైలు నుండి విడుదల కావడానికి చిరంజీవినే కారణం అంటున్నారు.
Icon Star @alluarjun along with his family met Megastar @KChiruTweets garu at his residence this afternoon! pic.twitter.com/qkcU2rehWv
— Team Allu Arjun (@TeamAAOfficial) December 15, 2024
ఈ నేపధ్యంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లారు బన్నీ. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జైలు నుండి వచ్చాక చిరంజీవి ఇంటికి వెళ్లిన బన్నీ మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలిపి కాసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే పలు ఫోటోలు కూడా దిగారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.