Allu Arjun : నువ్వు అంటే నాకు పిచ్చి అంటున్న అల్లు అర్జున్.. ఇంతకీ ఆ పిచ్చి ఎవరి మీద..?
అల్లు అర్జున్ తాజాగా ఒక వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో నువ్వు అంటే నాకు పిచ్చి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఇంత పిచ్చి ప్రేమని ఎవరి మీద చూపిస్తున్నాడు..?

Allu Arjun Daughters Day post with his daughter Arha
Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ఏం చేసిన ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వాల్సిందే. తాజాగా బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నువ్వు ఎందుకు ఇంత క్యూట్ ఉన్నావు. క్యూట్ ఉండొచ్చు కానీ మరి ఇంత క్యూట్ గా ఎందుకు ఉన్నావు. నువ్వు అంటే నాకు పిచ్చి” అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఇంత పిచ్చి ప్రేమని ఎవరి మీద చూపిస్తున్నాడు..?
Kangana Ranaut : రామ్ చరణ్‌కి పెద్ద అభిమానిని అంటున్న కంగనా.. తన సినిమాలు అంటే..
నేడు సెప్టెంబర్ 24న డాటర్స్ డే (Daughters Day) కావడంతో ఫాదర్స్ అంతా.. సోషల్ మీడియాలో తమ డాటర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన గారాలపట్టి ‘అర్హ’కి విషెస్ తెలియజేస్తూ.. తనతో ఆడుతున్న ఒక వీడియోని షేర్ చేశాడు. ఆ విడియోలోనే అల్లు అర్జున్ పైన చెప్పిన మాటలు చెబుతుంటే, అర్హ బదులిస్తూ.. ‘నేను చాలా క్యూట్ గా ఉంటాను’ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడుతుంది.
ఇక ఈ వీడియోకి అల్లు అర్జున్ ఇలా రాసుకొచ్చాడు.. “ఈ ప్రపంచాన్ని మరింత అందంగా చేస్తున్న ప్రతి కూతురికి డాటర్స్ డే శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్టులో అల్లు అర్జున్, అర్హ బాండింగ్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ క్యూట్ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.
View this post on Instagram
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) విషయానికి వస్తే.. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పార్ట్, జాతీయ అవార్డుతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో సుకుమార్ సెకండ్ పార్ట్ ని ఆ అంచనాలకు తగ్గట్టు రెడీ చేస్తున్నాడు.