Allu Arjun Emotional : అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె శనివారం(ఆగస్టు 30) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు.
అల్లు అర్జున్ మూవీ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే షూటింగ్‌ను ఆపేసి హుటాహుటీన బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చారు. అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్న ఆయన నానమ్మ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
Mayookham : మైథలాజికల్ థ్రిల్లర్‌గా మయూఖం..
అప్పటికే అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ అక్కడికి చేరుకున్నారు. దుఃఖంలో ఉన్న అల్లు అర్జున్‌ను చిరు ఓదార్చారు. నానమ్మ మీద ఉన్న ప్రేమతో అల్లు అర్జున్.. చిరంజీవి ఎదుట కంటతడి ((Allu Arjun Emotional)) పెట్టుకున్నారు.
మరోవైపు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.